Nalgonda Police | కిడ్నాపర్ చెర నుంచి బాలుడికి విముక్తి కలిగించిన పోలీసులు
Nalgonda Police | నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్‌కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని టూటౌన్ పోలీసులకు మార్గదర్శనం చేస్తూ చేధిచారు.
నల్లగొండ జిల్లా : నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్‌కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని టూటౌన్ పోలీసులకు మార్గదర్శనం చేస్తూ చేధిచారు. ఎస్పీ పవార్ తెలిపిన వివరాల ప్రకారం… బాలుడి తల్లి, ఫిర్యాదుదారు అయిన షమీమున్నీసా గత మూడేళ్ల నుంచి తన భర్త మహ్మద్ అహ్మద్, తన ఇద్దరు పిల్లలు.. కొడుకు అబ్దుల్ రహ్మాన్ (3), కూతురు అలీన (5) లతో కలిసి కడు పేదరికంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్నారు.
ఆమె భర్త పెయింటింగ్ పనికి వెళ్తూ కుటుంబ అవసరాలు తీరుస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు బాలుడు అబ్దుల్ రహ్మాన్ ఆసుపత్రి ఆవరణలో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆడుకుంటుండగా నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన రాపోలు సీతారాములు (40) ఆ బాలుడిని మచ్చిక చేసుకుని మాయమాటలు చెప్పి, కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు ప్రక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించక పోవడంతో నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ నాగరాజు వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా SP శరత్ చంద్ర పవార్ కూడా బాలుని ఆచూకీ కోసం ఆరు పోలీస్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నల్లగొండ డీఎస్పీ K శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూ టౌన్ సీఐ S రాఘవరావు పర్యవేక్షణలో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. నల్లగొండ టూ టౌన్ SI రావుల నాగరాజు తన సిబ్బంది సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, జానకి రామ్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని CC టీవీ కెమెరాలు పరిశీలించి నేరస్థుడిని గుర్తించారు.
నేరస్తున్ని పట్టుకుని విచారించగా అతని చిన్నమ్మ కూతురు ముద్దముల అరుణకు ముగ్గురు కూతుర్లు జన్మించారని, మగ సంతానం లేకపోవడంతో ఆమె కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో బాలుడు గత కొద్ది రోజుల నుంచి ఆడుకోవడం గమనించి అతడిన కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. అనంతరం ఆ బాలుడిని తన చిన్నమ్మ కూతురు అరుణకు ఇచ్చినట్లు చెప్పాడు. దాంతో పోలీసులు అరుణ నుంచి బాలుడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును 24 గంటల్లో చేధించిన టూటౌన్ పోలీసులను నల్లగొండ SP శరత్చంద్ర పవార్ అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

