న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకునే వీడియోలను (Viral Video) షేర్ చేసే నాగాలాండ్ టూరిజం, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెంజెన్ ఇమ్న అలంగ్ లేటెస్ట్ వీడియోతో ముందుకొచ్చారు. నిత్యం మనం ఉపయోగించే గృహోపకరణాలతో ఓ వ్యక్తి డ్రమ్ సెట్‌ను తయారుచేసిన వీడియోను నాగాలాండ్ మంత్రి షేర్ చేయగా ప్రస్తుతం ఆ క్లిప్ నెట్టింట తెగ వైరలవుతోంది.
मेहनत ही ऐसी करो की किस्मत भी,
तुम्हारा साथ देने पर मजबूर हो जाए। pic.twitter.com/Dv6klWIsOO— Temjen Imna Along (@AlongImna) August 11, 2023
వుడెన్ షెల్స్, ప్లాస్టిక్ డ్రమ్ హెడ్స్, మెటల్ హార్డ్‌వేర్‌తో తయారుచేసిన ఈ డ్రమ్ సెట్ సదరు వ్యక్తి సృజనాత్మకతకు, అతనికున్ సంగీత పటిమకు అద్దం పడుతున్నదని నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
ఇలాగే కష్టించి పనిచేస్తూ పోతే అదృష్టం కూడా నీ తలుపు తడుతుందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 16,000 మందికిపైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఇలాంటి నైపుణ్యాలకు సోషల్ మీడియా సరైన అడ్డా అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
Read More :