క్యాన్సర్ గురించి కొన్ని అపోహలు.. ఇవీ వాస్తవాలు
కరోనా కల్లోలం చుట్టుముట్టిన 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది క్యాన్సర్ వ్యాధికి బలయ్యారు. ఇప్పటికీ అతిపెద్ద ప్రాణాంతక వ్యాధి క్యాన్సరే. ఇది అన్ని వయసులవారికి, అన్ని శరీరభాగాలకు సోకే వ్యాధి.
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం చుట్టుముట్టిన 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది క్యాన్సర్ వ్యాధికి బలయ్యారు. ఇప్పటికీ అతిపెద్ద ప్రాణాంతక వ్యాధి క్యాన్సరే. ఇది అన్ని వయసులవారికి, అన్ని శరీరభాగాలకు సోకే వ్యాధి. నిజానికి అనేక రుగ్మతలకు గుండుగుత్తగా పెట్టిన పేరే క్యాన్సర్. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ చుట్టూ అనేక అపోహలు అల్లుకున్నాయి. ప్రజలు క్యాన్సర్‌ను సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడానికి ఈ అపోహలే కారణం. క్యాన్సర్ అంటే మరణశాసనమని ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైంది. ఇది ఎంతమాత్రం నిజం కాదు. క్యాన్సర్ వచ్చినవాళ్లందరూ చనిపోతారనడం సరికాదు. శాస్త్రవేత్తలు ఈ వ్యాధి గురించి అంతకంతకూ కొత్త విషయాలు తెలుసుకుని కొత్త చికిత్సలు రూపొందిస్తున్న కొద్దీ కోలుకునేవారి శాతం పెరుగుతూ వస్తున్నది. గత 40 సంవత్సరాల్లో క్యాన్సర్ నుంచి కోలుకునేవారి సంఖ్య బ్రిటన్‌లో రెట్టింపు అయ్యింది. ఇది కూడా క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. అదే బ్రిటన్‌లో వృషణాల క్యాన్సర్ బారిన పడినవారు 98 శాతం కోలుకుంటే, పేంక్రియాస్ క్యేన్సర్ వచ్చినవారిలో 1 శాతం మంది మాత్రమే కోలుకున్నారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి రాదు. కానీ హెచ్‌పీవీ, హెపటైటిస్ బీ, సీ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల కారణంగా క్యాన్సర్ తలెత్తవచ్చు. క్యాన్సర్ గురించిన ఇంకో ముఖ్యమైన అపోహ అది సెల్ పోన్ వాడకం వల్ల వస్తుందని. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. సెల్ రేడియో తరంగాల సాయంతో పనిచేస్తుంది. ఇదొక రకం రేడియేషన్. కానీ ఈ రేడియేషన్ శరీరానికి హాని చేయదు. అయోనైజింగ్ లక్షణం లేకపోవడమే ఇందుకు కారణం. దీనివల్ల క్యాన్సర్ ముప్పు ఏమాత్రం ఉండదు. క్యాన్సర్ కు సెల్ రేడియేషన్‌కు లింకు పెట్టే ఆధారమేదీ ఇంతవరకు వెలుగు చూడలేదు. విద్యుత్ తీగల వల్ల క్యాన్సర్ వస్తుందనేది మరో అపోహ. కరెంటు తీగలు కూడా నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందకే వస్తాయి. కనుక దీనివల్ల క్యాన్సర్ ముప్పు ఎంత మాత్రం ఉండదు. కృత్రిమ చక్కెర వల్ల క్యాన్సర్ వస్తుందనేది ఇకో అపోహ. శాకరిన్తో కూడిన సైక్లమేట్ వల్ల ల్యాబ్ జంతువులకు క్యాన్సర్ వచ్చినట్టు తొలినాళ్ల అధ్యయనాల్లో తెలిసింది. అయితే మనుషులపై జరిపిన పరీక్షల్లో ఇది రుజువు కాలేదు. కచ్చితమైన ఆధారాలేవీ ఇప్పటివరకు లభించలేదు. క్యాన్సర్ సర్జరీ వల్ల క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపిస్తుందని మరో అపోహ. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఆదునిక పరికరాలు రావడం, ఇమేజింగ్ టెక్నిక్ లు అభివృద్ధి చెందడం వల్ల ఈ ముప్పు చాలా వరకు తప్పింది. ట్యూమర్ ను ఓపెన్ చేసినా అది వ్యాపించే ప్రమాదముందని అనడం కూడా ఇలాంటిదే. క్యాన్సర్‌కు ఎలాంటి మూలికా వైద్యం లేదు. ఎవరైనా ఏదైనా మూలికా ఔషధం తీసుకోవాలంటే తప్పకుండా క్యాన్సర్ వైద్యనుని సంప్రదించాలి. లేకపోతే ఆ మూలికా ఔషధమే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇక క్యాన్సర్ అనేది వంశపారంపర్య జాడ్యం కాదు. కేవలం 3-10 శాతం మందిలో జన్యు మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముంటుంది. ఒకసారి పోయినా మళ్లీ తిరిగి వస్తుందనేది క్యాన్సర్ గురించిన బలమైన అపోహల్లో ఒకటి. నిజంగా క్యాన్సర్ పోయిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా తిరగబెట్టడం అనే అపోహ వచ్చింది. క్యాన్సర్ కు చికిత్స లేదనే అతిపాత అపోహ మెల్లమెల్లగా వీగిపోతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

