హైదరాబాద్‌లో మౌంట్ ప్లాంట్
శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానళ్ల తయారీలో ఉన్న మౌంట్ రూఫింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిందని కంపెనీ తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 23: శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానళ్ల తయారీలో ఉన్న మౌంట్ రూఫింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో పారిశ్రామిక విస్తరణకు, దేశీయ తయారీ మౌలిక వసతుల బలోపేతానికి ఇది కీలక అడుగని పేర్కొంది. కొత్త కేంద్రంలో తెలంగాణలోనే తొలి నిరంతర శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానల్ తయారీ లైన్‌ను ఏర్పాటు చేసినట్టు మౌంట్ తెలిపింది.
దీనివల్ల అధునాతన ఇన్సులేటెడ్ ప్యానళ్ల తయారీ సామర్థ్యం రాష్ర్టానికి అందుబాటులోకి వచ్చి, పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నాణ్యమైన నిర్మాణ సామగ్రి సరఫరా పెరుగుతుందని వివరించింది. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో మూడు ఉత్పత్తి లైన్లకు అవకాశముందని కంపెనీ వర్గాలు వెల్లడించారు. వీటిలో రెండు నిరంతర శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానల్ తయారీ లైన్లు, ఒక ప్రత్యేక రాక్‌వూల్ శాండ్విచ్ ప్యానల్ ఉత్పత్తి లైన్ ఉన్నాయని కంపెనీ తెలిపింది.
మొదటి నిరంతర శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానల్ లైన్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని, దీని ద్వారా నెలకు 3 లక్షల చదరపు మీటర్ల ప్యానళ్లను తయారుచేయవచ్చని పేర్కొంది. అదే కేంద్రంలో రెండో శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానల్ లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తున్నది. వచ్చే 8 నుంచి 10 నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ కొత్త యూనిట్‌తో నెలకు మరో 3 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం చేరుతుందని పేర్కొంది. ఈ రెండు నిరంతర శాండ్విచ్ పీయూఎఫ్ ప్యానల్ లైన్లతో కలిపి నెలకు 6 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం వస్తుందని తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

