హిజబ్ వివాదంపై అమెరికా కామెంట్.. కౌంటర్ ఇచ్చిన ఇండియా
న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్రంలో రాజుకున్న హిజబ్ వివాదంపై అమెరికా కామెంట్ చేసింది.
ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంబాసిడర్ రాషద్ హుస్సేన్ ఆ అంశంపై ఓ ట్వీట్ చేశారు. స్కూళ్లలో హిజబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను హరించడమే అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లోనే ఐఆర్ఎఫ్ అంబాసిడర్‌గా రాషద్ను అమెరికా నియమించింది. అయితే రాషద్ చేసిన కామెంట్‌కు ఇండియా రియాక్ట్ అయ్యింది. వక్రబుద్ధితో చేసిన వ్యాఖ్యలను స్వాగతించడం లేదని ఇవాళ విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ఓ ట్వీట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల అభిప్రాయాలను పట్టించుకోమన్నారు. డ్రెస్ కోడ్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన డ్రెస్ కోడ్ వివాదం ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉందని, మన రాజ్యాంగ నిర్మాణం, నిర్వహణ.. మన ప్రజాస్వామ్య విధానానికి లోబడే మన సమస్య పరిష్కారం జరుగుతుందని, ఇండియా గురించి పూర్తిగా తెలిసినవారే ఈ విషయాలను మెచ్చుకుంటారని, అంతర్గత అంశాలపై అనుచిత వ్యాఖ్యలను స్వాగతించడంలేదని అరిందం తన ట్వీట్లో తెలిపారు.
Our response to media queries on India’s reaction to comments by some countries on dress code in some educational institutions in Karnataka:https://t.co/Mrqa0M8fVr pic.twitter.com/pJlGmw82Kp
— Randhir Jaiswal (@MEAIndia) February 12, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- arindam bagchi
- Hijab Row
- irf
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

