WHO | మంకీ పాక్స్ వైరస్ యావత్ ప్రపంచానికి ఒక మేల్కొలుపు హెచ్చరిక అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. 1979-80 నుంచి స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిలిపేశారని, అందువల్లే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండవచ్చునని వ్యాఖ్యానించారు. ఆ మంకీ పాక్స్ వైరస్ ప్రాణాంతకంగా మారక ముందే, దానిని కట్టడి చేయడానికి యావత్ ప్రజానీకం సన్నద్దం కావాలని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మంకీ పాక్స్ వైరస్.. ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. దీనిపై నిర్వహించిన క్లినికల్ ప్రెజెంటేషన్లు.. స్మాల్ పాక్స్ (మశూచీ)ని పోలి ఉన్నాయి. ఆర్థో పాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్తో ప్రపంచవ్యాప్తంగా సోకిన స్మాల్ పాక్స్‌ను 1980లో రూపుమాపారు. మశూచీని నిర్మూలించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్లను.. మంకీ పాక్స్‌కు వ్యతిరేకంగా ఉపయోగించొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైట్ పేర్కొంది. కానీ, అభివృద్ధి చేసిన నూతన వ్యాక్సిన్లలో ఒకటి మాత్రం మంకీ పాక్స్‌ను నిరోధిస్తుందని రుజువైందన్నారు. అయితే, మశూచీ నిర్మూలన వ్యాక్సిన్‌తో ఉపయోగకరమని ల్యాబోరేటరీ డేటా ద్వారా తేలాల్సి ఉందన్నారు సౌమ్య స్వామినాథన్.