MLA Gandra | విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకే డిగ్రీ, పీజీ కళాశాలల ఏర్పాటు : ఎమ్మెల్యే గండ్ర
MLA Gandra | జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలను, గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలను, గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్ కళాశాలలో శుక్రవారం తరగతుల ప్రారంభోత్సవం జరుగుతుందని మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో శుక్రవారం మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్, పోలీసు హెడ్ క్వార్టర్ భవనాలను త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభం చేస్తారని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

