38 మంది భార్యలు, 89 మంది పిల్లలున్న మిజోరాం వ్యక్తి మృతి

అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అజ్వల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామంలో నివసిస్తున్న జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతోపాటు పెద్ద సంఖ్యలో మనుమలు,మనవరాళ్ళు ఉన్నారు. దీంతో ప్రపంచంలోనే అది పెద్ద కుటుంబంతో నివాసం ఉంటున్న ఆయన గ్రామం బక్తాంగ్ త్లాంగ్నుమ్ మిజోరాంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. కాగా, జియోనా చానా మరణంపై మిజోరాం సీఎం జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన పెద్ద కుటుంబం వల్ల బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామం రాష్ట్రంలోనే ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా మారిందని కొనియాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 38 wives
- 89 kids
- Dies
- Mizoram man
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

