బెంగాల్ పోరు : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో మిథున్ చక్రవర్తి

కోల్కతా : దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మిథున్ చక్రవర్తి వంటి స్టార్లను ప్రచార బరిలో దింపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్లు ఉన్నారు.
ఇంకా ఈ జాబితాలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటులు లాకెట్ ఛటర్జీ, రూపా గంగూలీ, బాబుల్ సుప్రియో, మనోజ్ తివారీ, స్రవంతి ఛటర్జీ, పాయెల్ సర్కార్, హిరన్ ఛటర్జీలు కాషాయ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక నందిగ్రాం నుంచి పోటీ చేయనున్న సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారిని బీజేపీ బరిలో దింపింది. ఇక మత ప్రాతిపదికన ఓట్లు చీల్చాలనే బీజేపీ కుట్రలు ఫలించవని తాను హిందూ బ్రాహ్మణ మహిళనని మత రాజకీయాలు తన వద్ద చెల్లవని దీదీ స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

