రికార్డులన్నీ ఆమె వశమే.. ఆ లెజెండ్ యుగం ముగిసింది
హైదరాబాద్: మహిళా క్రికెట్‌కే వన్న తెచ్చిన మిథాలీ రాజ్ శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో రెండు దశాబ్ధాల క్రితం కొత్త వరవడిని సృష్టించిన మిథాలీ ఇక బ్యాట్‌కు సెలువు చెప్పింది. 23 ఏళ్ల కెరీర్లో అసాధారణ బ్యాటింగ్ శైలితో ఇండియాన వుమెన్ క్రికెటర్లకు మిథాలీ ప్రేరణగా నిలిచింది. అటాకింగ్ బ్యాటర్‌గా మిథాలీ తన క్రికెట్ స్కిల్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొన్నా.. ఇండియన్ జట్టును తన నాయకత్వ లక్షణాలతో ముందుకు తీసుకువెళ్లింది. మూడు ప్రపంచ కప్‌ల్లో భారత మహిళ జట్టుకు సారథిగా బాధ్యతల్ని నిర్వర్తించింది తన సత్తాను చాటుకున్నది.
మహిళల క్రికెట్లో మిథాలీ కెరీర్ ఎంతో మంది యువ క్రీడాకారిణిలకు ఆదర్శం. రాజ్ తన కెరీర్లో మొత్తం 12 టెస్టులు, 232 వన్డేలు, 89టీ20 మ్యాచ్‌లను ఆడారు. ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆమె చివరి సారి బ్యాట్ పట్టారు. ఆ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరిది. 23 కెరీర్లో మిథాలీ 64 హాఫ్ సెంచరీలతో అలరించింది. తన వన్డే కెరీర్లో ఆమె మొత్తం 7805 రన్స్ చేసింది. మిథాలీ ఖాతాలో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆమె యావరేజ్ స్కోరింగ్ 50.68గా ఉంది.
మిథాలీ టెస్టుల్లో ఆమె మొత్తం 699 రన్స్ చేసింది. 43.68 యావరేజ్‌తో ఆ పరుగులు సాధించింది ఆమె. దాంట్లో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లోనూ సుదీర్ఘ కెరీర్‌నే మిథాలీ కొనసాగించింది. కానీ ఆ తర్వాత ట్యాలెంట్ ఉన్న యువ క్రీడాకారిణిలు రావడంతో.. కొంత వరకు మిథాలీ కెరీర్ మసకబారింది. మిథాలీ టీ20ల్లో 37.52 సగటుతో మొత్తం 2364 రన్స్ చేసింది. దాంట్లో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 అత్యధికంగా 97 రన్స్ చేసింది మిథాలీ.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ పేరిట రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్లతో కలిపి ఆమె 10,868 రన్స్ చేసింది. మహిళా క్రికెట్లో పది వేల పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరూ లేరు. అంతేకాదు వన్డేల్లోనూ అత్యధికంగా ఆమె 7805 రన్స్ చేసింది. ఈ రికార్డును కూడా మరో ప్లేయర్ అందుకోలేదు. మహిళల వన్డేల్లో ఓ దశలో ఆమె వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసింది. ఈ ఘనత కూడా ఆమె పేరిట ఉంది. వన్డేల్లో 64 హాఫ్ సెంచరీలో మరో అరుదైన రికార్డు. బ్యాట్‌తో ఇన్నాళ్లూ పరుగులు పారించిన హైదరాదీ ప్లేయర్.. రిటైర్మెంట్ తర్వాత రెండవ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ఇవాళ తన ట్వీట్లో తెలిపారు. రకరకాల రికార్డులన్నీ తన వశం చేసుకున్న మిథాలీ .. మహిళల క్రికెట్ చరిత్రలో ఓ లెజెండ్‌గా నిలిచిపోతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

