పెళ్లికి నిరాకరించిందని 32 కత్తిపోట్లు

అహ్మదాబాద్ : ఓ 23 ఏండ్ల యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మ్యారేజ్ ప్రపోజల్‌కు నిరాకరించిన 16 ఏండ్ల బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని జేటాల్సర్ గ్రామంలో ఈ నెల 17న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 12వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉండగా.. జయేశ్ అనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి.. 32 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో బాలిక సోదరుడు కూడా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలిక మరణించింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు జయేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి నిరాకరించడంతోనే కత్తితో దాడి చేశానని జయేశ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడికి కఠిన శిక్ష అమలు చేయాలని మృతురాలి తండ్రితో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

