Christian Bhavan | రేపు క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన : మంత్రి తలసాని
Christian Bhavan | క్రిస్టియన్లకు గతంలో ఇచ్చిన మాట మేరకు రేపు క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ నెల 13 న కొత్త దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు.
Christian Bhavan | రేపు క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి కొత్త దుస్తుల పంపిణీ ఉంటుందన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై పలు క్రిస్టియన్ సంస్థలు, పాస్టర్లతో మంత్రి తలసాని మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లకు గతంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రిస్టియన్ భవనం నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇందుకోసం ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించిందని గుర్తు చేశారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వమే రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఈ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. సంఘాలు, వర్గాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు హాజరై శంకుస్థాపన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 13 వ తేదీన నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందుల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని సంఘాలు, పాస్టర్లు ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

