Minister Mallareddy | ఉపాధి కల్పనలో..తెలంగాణ దేశానికే రోల్‌మాడల్ : మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy | ఉపాధి కల్పనలో తెలంగాణ దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తుందని, స్వరాష్ట్రంలోనే మహిళ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, పాలన దక్షతలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతోనే.. ప్రతి రంగంలో మహిళమణులు దూసుకెళ్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్, జులై 31: ఉపాధి కల్పనలో తెలంగాణ దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తుందని, స్వరాష్ట్రంలోనే మహిళ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, పాలన దక్షతలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతోనే.. ప్రతి రంగంలో మహిళమణులు దూసుకెళ్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) వారి ఆధ్వర్యంలో 160మంది మహిళలకు కట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకే వలస వస్తున్నారని, మహిళలు స్వయం కృషితో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని, మహిళల రక్షణకోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారని, అమ్మాయిల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
మహిళలు కుట్టు మిషన్‌లో ప్రత్యేకతను కనబర్చి, ఇతరులకు ఉపాధిని కల్పించి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు ఏకే మురుగేష్, లలితాయాదవ్, జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, నిహారికగౌడ్, మెట్టు ఆశాకుమారి, లావణ్యసతీష్గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, వేణు, శారదామనోధర్రెడ్డి, పల్లపు రవి, వేణు, కోఆప్షన్‌సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, న్యాక్ అధికారులు, నాయకులు సాధిక్, ప్రకాష్, నవీన్‌యాదవ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

