పహాడీ షరీఫ్ దర్గా అభివృద్ధిపై మంత్రి కొప్పుల వివరణ

హైదరాబాద్ : శాసనసభలో పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్‌లోని దర్గా హజ్రత్ బాబా షరీఫుద్దీన్ సాయబ్ వద్ద ప్రస్తుతమున్న జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ.. సీసీ రోడ్డు ర్యాంపు రోడ్లు, మోటరబుల్ ట్రాక్, ఫోర్ వీలర్ వాహనాలను కొండపైకి పార్కింగ్ స్థల నిర్మాణం కోసం గ్రాంట్ కింద.. 9 కోట్ల 60 లక్షల మొత్తాన్ని 2017 సంవత్సరంలో 264 జీవో ద్వారా ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్ట ఈడబ్ల్యూఐడీసీకి అప్పగించామని చెప్పారు.
అదే విధంగా మౌలాలి వద్ద ర్యాంపు నిర్మాణాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు తెలిపారు. అన్ని మతాలను గౌరవించడంతో పాటు ఆ మత విశ్వాసాలకు సంబంధించిన మసీదులు, చర్చిలు, ఇతర టెంపుల్స్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పహాడీ షరీఫ్ దర్గాకు దేశం నలుమూలాల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ దర్గాను అభివృద్ధి చేయాలని కోరినప్పుడు.. సీఎం కేసీఆర్ దాన్ని గొప్పగా నిర్మాణం చేస్తామని చెప్పి నిధులు కేటాయించారని తెలిపారు. ఈ దర్గా వద్ద ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి అని పేర్కొన్నారు. మౌలాలి వద్ద ర్యాంపు కోసం రూ. ఒక కోటి 87 లక్షలు మంజూరు చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

