రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది: మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాములపర్తి, వర్గల్ నవోదయ వద్ద కెనాల్ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. వర్గల్ మండలం హౌసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువలోకి గోదావరి జలాలను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామం వద్ద గజ్వేల్ కాలువలోకి గోదావరి జలాల విడుదల చేస్తారు. కొండపోచమ్మ సాగర్ నుంచి 90కి.మీ మేర ప్రయాణించి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు చేరనున్నాయి.
‘గోదావరి జలాలతో 14,268 ఎకరాల్లో పంటలను కాపాడుకోవచ్చు. రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది. భూ సేకరణకు సహకరించి గోదావరి జలాలు గజ్వేల్ కు వచ్చేందుకు సహకారం అందించిన రైతులందరికీ ధన్యవాదాలు. పంటను కాపాడేందుకు గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంగా రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అని మీడియా సమావేశంలో హరీశ్ రావు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- harish rao
- Siddipet Tour
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

