పెద్ద నగరాలకు బస్తీ దవాఖానాలు విస్తరిస్తాం : మంత్రి ఈటల

హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకు బస్తీ దవాఖానాలను విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.
రోజురోజుకు పట్టణ జనాభా పెరుగుతుందన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో ఉంటున్న పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను ఆదర్శంగా తీసుకుని బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారు. ఈ క్రమంలో 10 వేల జనాభా ఉన్న బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.
ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సుతో పాటు అటెండర్ ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. కావాల్సిన మందుల కోసం నెలకు రూ. 20 వేలు సమకూర్చామని చెప్పారు. అన్ని బస్తీ దవాఖానాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో అనుసంధానం చేశామన్నారు. బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ దవాఖానాలు హైదరాబాద్‌లో సక్సెస్ కావడంతో.. వీటిని మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

