మక్కీకి మక్కీ..

- 25 మందిని మోసం చేసిన సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగి..
- రూ.1.27 కోట్లు వసూలు..ముగ్గురు అరెస్టు..
సిటీబ్యూరో, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం.. సిద్దిపేటలో పోస్టింగ్.. అపాయింట్మెంట్ లెటర్ పెట్టుకుని ఓ యువకుడు…అక్కడి పంచాయితీరాజ్ శాఖ కార్యాలయానికి చేరుకున్నాడు.. తాను జూనియర్ అసిస్టెంట్‌గా చేరుతున్నానంటూ..అక్కడి వారికి చెప్పాడు.. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ అపాయింట్మెంట్ లెటర్‌ను చూసి.. కంగుతిన్నారు. ఇది ఫేక్ అని.. ఇంకా ఇక్కడే ఉంటే..పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఆ యువకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పట్టరాని దుఃఖంతో ఇంటికి చేరాడు. ఇలా ఓ నిరుద్యోగి సస్పెండ్ అయిన పంచాయతీ సూపరింటెండెంట్ అధికారి బారిన పడి మోసపోయాడు. ఇతడే కాదు.. అనేక మంది లక్షలు చెల్లించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ అధికారులుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి.. సుమారు 25 మందిని నిండా ముంచేసిన ఆ నిందితులు అరాండ్కర్ రాజ్‌కుమార్(సస్పెండైన పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్) అరోర్ వీరమణి, పాండులను శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
మోసం చేశారిలా..
వరంగల్ జిల్లాకు చెందిన అరాండ్కర్ రాజ్‌కుమార్ ములుగు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. తాండూరుకు చెందిన అరొర్ వీరమణితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసుకొని.. నిరుద్యోగుల వద్ద రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా డబ్బులు తీసుకున్న వారికి అచ్చం ప్రభుత్వం జారీ చేసే అపాయింట్మెంట్ లేఖ, పోస్టింగ్‌కు సంబంధించిన డీవో కాపీలను ఇచ్చారు. బాధితులను నమ్మించేందుకు రాజ్‌కుమార్ , వీరమణి వారిని ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ శాఖకు తీసుకువచ్చి పార్కింగ్ స్థలంలో నిలబెట్టి.. మొత్తం ప్రక్రియ నడుస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ విధంగా రాజ్‌కుమార్, వీరమణి, పాండును ముఠాలో చేర్చుకొని.. మొత్తం 25 మంది నుంచి దాదాపు 1.27 కోట్లు వసూలు చేసి నిండాముంచారు. ఈ ఫిర్యాదులపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు బృందం ప్రత్యేకంగా దర్యాప్తు జరిపి.. శనివారం ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 8.85 లక్షల నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన రాజ్‌కుమార్.. మోసం చేయడంతో అక్కనపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌లో ఉండగా మరోసారి మోసాలకు పాల్పడి రాజ్‌కుమార్ దొరికిపోయాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Hyderabad News
- money scam
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

