కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఆ తర్వాత అనేక హిట్ చిత్రాలలో నటించింది. కెరీర్ మొదట్లో మెహరీన్‌కి మంచి సక్సెస్‌లు లభించాయి. కాని రాను రాను అమ్మడి సక్సెస్ రేటు కూడా తగ్గింది. చివరిగా ఎఫ్ 2 చిత్రంతో మంచి హిట్ కొట్టిన మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంతో పాటు మారుతి దాసరి, సంతోష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ తాజాగా తనతో పాటు తన స్టాఫ్ అందరు వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోలు షేర్ చేసింది. అందరు టీకా బాగానే వేయించుకోగా, ఈ అమ్మడు మాత్రం బిగపట్టుకు కూర్చుంది. చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ అంటే చాలా భయం అని, అందుకే అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని చెప్పుకొచ్చింది మెహరీన్. ఈమె త్వరలోనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకోనుంది.