Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Randhir Jaiswal: ఇలియనాస్ టెంపుల్లో జరిగిన ఘటన పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ వ్యతిరేక, వివక్షపూరిత ప్లాన్ చాలా డిస్టర్బింగ్‌గా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి, బాధ్యులైనవారికి శిక్షపడేలా చేయాలన్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ ఆలయంలో 19 ఏళ్ల టీనేజర్ అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ తన వద్ద ఉన్న గన్‌తో సామూహిక కాల్పులు జరపాలని భావించాడు. కానీ గన్ జామ్‌కావడంతో అతని ప్లాన్ విఫలమైంది. ఈ ఘటనలో ఆ నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన పట్ల ఇవాళ భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ వ్యతిరేక, వివక్షపూరిత ప్లాన్ చాలా డిస్టర్బింగ్‌గా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొన్నది. ఆ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్(Randhir Jaiswal) ఇవాళ మీడియాను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఇలియనాస్ ఘటన అమెరికాలో భారతీయుల పట్ల ఉన్న విద్వేషాన్ని చూపిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వం విద్వేష పూరిత హింస పట్ల జీరో టాలరెన్స్ చూపించాలని, భారతీయులకు భద్రత కల్పించాలన్నారు. అరోరా టెంపుల్లో సామూహిక కాల్చివేతకు ప్లాన్ చేసిన నిందితుడి ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతనిపై నమోదు చేసిన కేసులను కూడా పరిశీలిస్తున్నామని రణధీర్ తెలిపారు.
అమెరికాలో ఇండియాపై ద్వేషం పెరుగుతోందన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి, బాధ్యులైనవారికి శిక్షపడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రణధీర్ జైస్వాల్ కోరారు.
Our response to media queries regarding an attempted mass shooting incident in the United States.
🔗 https://t.co/mKh70FMPsI https://t.co/yVQ3OeSo4d
— Randhir Jaiswal (@MEAIndia) October 15, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

