వచ్చే ఏడాది 18 వేల మంది ఫ్రెషర్ల నియామకం
నోయిడా, అక్టోబర్ 31: నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ భారీఎత్తున రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రానున్న రెండు త్రైమాసికాల్లో కొత్తగా 10,000-12,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. 2022 రెండో క్వార్టర్లో మరో 5,800 మందిని రిక్రూట్ చేసుకుంటామన్నది. ఈ మేరకు హెచ్సీఎల్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు వెల్లడించారు. సెప్టెంబర్ 2021 త్రైమాసికం ముగిసేనాటికి 11,135 మందిని నియమమించుకున్నట్టు వివరించారు. ఇంతభారీ మొత్తంలో నియామకం చేపట్టడం సంస్థ చరిత్రలో తొలిసారని పేర్కొన్నారు.