Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Mars moon | జపాన్ (Japan) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మూన్ మిషన్ (MMX mission) ఆదివారం అర్ధరాత్రి మొదలైంది. ది మార్టియాన్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్ (MMX) పేరిట చేపట్టిన ఈ మిషన్ 2027 ఆగస్టు నాటికి అంగారకుడి సమీపంలోకి చేరుతుంది. ఆ తర్వాత అంగారకుడి మూన్ (Mars moon) పై నమూనాలను సేకరిస్తుంది.
Mars moon : జపాన్ (Japan) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మూన్ మిషన్ (MMX mission) ఆదివారం అర్ధరాత్రి మొదలైంది. ది మార్టియాన్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్ (MMX) పేరిట చేపట్టిన ఈ మిషన్ 2027 ఆగస్టు నాటికి అంగారకుడి సమీపంలోకి చేరుతుంది. ఆ తర్వాత అంగారకుడి మూన్ (Mars moon) పై నమూనాలను సేకరిస్తుంది. ఈ మిషన్‌ను జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (Japan Aerospace Exploration Agency) జాక్సా (JAXA) డిజైన్ చేసింది.
అంగారకుడి ఉపగ్రహం ఫోబోస్ నుంచి 10 గ్రాముల నమూనాలు సేకరించి తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే గ్రహ శకలాలను సేకరించడం జపాన్‌కు ఇదేం కొత్తకాదు. గతంలో రెండు మిషన్లను విజయవంతంగా చేపట్టింది. 1960 నుంచి చాలా దేశాలు పదుల సంఖ్యలో అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపించాయి. అయితే దాని ఉపగ్రహాలను మాత్రం పట్టించుకోలేదు. గతంలో రష్యా ఫోబస్పై దృష్టి పెట్టినా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. ఇప్పుడు జపాన్ ఆ ప్రయత్నం చేస్తున్నది.
జర్మనీ, ఫ్రాన్స్ 2029లో ఓ రోబోను ఫోబోస్‌పైకి పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫోబస్ అంగారకుడికి ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 20-30 కిలోమీటర్ల వ్యాసంతో ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Japan
- JAXA
- Mars moon
- MMX mission
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

