e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News 03-03-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

03-03-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

03-03-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. 

వృష‌భం: స‌్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్ల‌యితే అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. 

మిథునం: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గ‌డం మంచిది. 

క‌ర్కాట‌కం: స‌ంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. 

సింహం: బ‌ంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

క‌న్య‌: ‌విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌తో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

తుల‌: ప‌్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌నష్టం ఏర్ప‌డుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగుజేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. 

వృశ్చికం: కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఆర్థిక ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌డానికి రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధు, మిత్రుల స‌హాయ‌స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భిస్తాయి. 

ధ‌నుస్సు: ధ‌ర్మ‌కార్యాలు చేయ‌డంలో ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. కుటుంబ‌సౌఖ్యం ఉంటుంది. మాన‌సిక ఆనందాన్ని అనుభ‌విస్తారు. పేరు ప్ర‌తిష్ఠ‌లు లభిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. 

మ‌క‌రం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్తి అవుతాయి. 

కుంభం: ‌కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హాలు ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. 

మీనం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌కూడ‌దు. 

పంచాంగ‌క‌ర్త‌…
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
03-03-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement