Tokyo Olympic : ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు నిరాశే
ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు నిరాశే | ఒలింపిక్స్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలోనూ భారత జోడి నిరాశ పరిచింది. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో మను భాకర్ - సౌరభ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచి.. క్వాలిఫికేషన్-2కు అర్హత సాధించిన జోడీ.. ఏడో స్థానంలో

టోక్యో : ఒలింపిక్స్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలోనూ భారత జోడి నిరాశ పరిచింది. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచి.. క్వాలిఫికేషన్-2కు అర్హత సాధించిన జోడీ.. ఏడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్-2లో ఎనిమిది జట్లు పాల్గొనగా.. మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ ఏడో స్థానానికే పరిమితమైంది. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పథకంపై ఆశలు చిగురించాయి. మూడవ సిరీస్‌లో మను-సౌరభ్ జోడీ 193 పాయింట్లు సాధించారు. మను 95, సౌరభ్ 98 ప్లాయింట్లు సాధించి మొదటి రౌండ్లో అగ్రస్థానంలో నిలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు.
ఈ రౌండ్లో సౌరభ్ అద్భుతంగా రాణించాడు. రెండవ సిరీస్‌లో 10-10 లక్ష్యాలను సాధించాడు. అలాగే మరో యశస్విని- అభిషేక్ వర్మ జోడీ సైతం నిరాశపరిచింది. జోడీ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఒలిపింక్స్ ఐదో రోజు ఆరు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో శరత్ కమల్ ఈ రోజు బరిలోకి దిగనున్నాడు. భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌రాజ్ రాన్కీరెడ్డి, చిరాగ్‌శెట్టి బ్యాట్మింటన్ గ్రూప్-ఏలో పాల్గొననున్నారు. అలాగే సెయిలింగ్, బాక్సింగ్‌లోనూ భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇవి కూడాచదవండి..
27.07.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
కాలేయం కాపాడుకుందాం
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

