కాచిగూడ,ఆగస్టు 12 : నిబంధనలకు విరుద్ధంగా షాపులో 14 కేజీల సిలిండర్ నుంచి 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లకు గ్యాస్‌ను మార్పిడి చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్లోని కబేళా ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీ కుమారుడు సయ్యద్ అబూబాకర్(28) కొంత కాలంగా 14 కేజీల సిలిండర్ల నుంచి 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లలో గ్యాస్‌ను నింపుకొని నగరంలోని వివిధ ప్రాంతలకు అక్రమంగా తరలిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు.
విస్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు నింబోలి అడ్డాలోని షాపులో పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌కు మార్చుతుండగా రెడ్‌హ్యండ్‌గా పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అబూబాకర్ నుంచి 7 చిన్న సిలిండర్లు, పెద్ద సిలిండర్‌ను స్వాదీనం చేసుకొని అరెస్ట్ చేశారు.