Vaccination | చిన్నారుల వ్యాక్సినేషన్ను నీరుకార్చిన మోదీ సర్కార్ : మల్లికార్జున్ ఖర్గే
Vaccination : చిన్నారులకు మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ చేపట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.
Vaccination : చిన్నారులకు మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ చేపట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. పీఎం కేర్స్ కేవలం దుబారాకేనని మండిపడ్డారు. 2023లో 16 లక్షల మంది పిల్లలకు డిప్తీరియా, టెటనస్, డీటీపీలకు వ్యాక్సిన్లు, మీజిల్స్ ఇవ్వలేదని అన్నారు.
కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో అనాధలుగా మారిన పిల్లలు సాయం కోసం చేసుకున్న దరఖాస్తుల్లో సగం దరఖాస్తులను పీఎం కేర్స్ ఫండ్ తిరస్కరించిందని ఆరోపించారు. ఎలాంటి కారణాలు చూపకుండానే చిన్నారుల దరఖాస్తులను తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన పటిష్ట ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని ఎక్స్ వేదికగా ఖర్గే పోస్ట్ చేశారు.
లక్షలాది చిన్నారులకు వ్యాక్సినేషన్ చేపట్టకుండా మోదీ ప్రభుత్వం పాపానికి ఒడిగట్టిందని, ఇమ్యూనైజేషన్ పట్ల నిర్లక్ష్యం వహించడం అంటే విలువైన ప్రాణాలను కోల్పోవడమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీజీ, మన చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోకుండా మనం వికసిత్ భారత్ ఎలా సాధిస్తామని ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. వాస్తవానికి పీఎం కేర్స్ ఓ వృధా ప్రయాస మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Bharateeyudu 2 | భారతీయుడు -2 నిడివి తగ్గించలేదు.. శంకర్ ఒప్పుకోలేదా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

