మలేషియా : బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ( Mahesh Bigala ) మలేషియా తెలుగు అకాడమీ ( Malaysia Telugu Academy ) ని సందర్శించారు. ఈ సందర్భంగా మలేషియాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల విజయవంతానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ వేడుకలను బీఆర్ఎస్ యుఎస్ఏ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మహేశ్ బిగాల తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ( KTR ) జూన్ 6న ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మద్దతుగా మలేషియాలోని అనేక భారతీయ, ప్రాంతీయ సంఘాలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మహేశ్ బిగాల అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ సంస్కృతిని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే చారిత్రక కార్యక్రమంగా నిలిచిపోనుందని స్పష్టం చేశారు. మహేశ్ బిగాలతో పాటు బీఆర్ఎస్ యుఎస్ఏ , మైటా బృంద సభ్యులు మారుతి కుర్మ, సందీప్ గౌడ్ , కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు.