మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియాగా మారింది : కేసీఆర్
CM KCR | మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
CM KCR | మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. 54 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్, 16 సంవత్సరాలు బీజేపీ పార్టీలు పాలించాయని, రెండు పార్టీలు ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావంటూ కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారని ఆరోపించారు. చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనాబజార్లు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. దేశమంతా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాందేడ్‌లో ఎన్ని చైనాబజార్లు ఉన్నాయో లెక్కబెట్టారా? ప్రశ్నించారు. ప్రధాని మన్‌కీ భారత్ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని, ఇది రాజకీయం కాదు.. ఇది జీవన్మరణ సమస్య అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

