ఇండియాను విమర్శించడం ఇకనైనా మానుకోండి

న్యూఢిల్లీ: ప్రతిదానికీ ఇండియాను నిందించడం, ఎక్కడెక్కడో ఉన్నవాటిని మెచ్చుకోవడం మానాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో ఉద్బోధించారు. ఊరికే ఇండియాను తిట్టుకుంటూ కూర్చోవద్దని.. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని భారత్ విమర్శకులకు హితవు పలికారు. జపాన్‌లోని ఒసాకా నగరం తాజాగా పెచ్చరిల్లుతున్న కోవిడ్ కల్లోలంతో సతమతమవుతూ ఉన్నది. ఆ నగరం ముంబై మోడల్‌ను అమలు చేయాలని ఆయన సూచించారు. మనమంతా ఉమ్మడిగా కృషి చేస్తేనే వైరస్‌పై విజయం సాధించగలమని అన్నారు. రేవుపట్టణం, వ్యాపార కేంద్రమైన ఒసాకాకు, ముంబైకి దగ్గరి పోలికలు ఉన్నాయని మహీంద్ర పేర్కొన్నారు. జపనీస్ నమూనా గురించి ఇన్నాళ్లూ మనం గొప్పగా చెప్పుకున్నాం.. కానీ ఇప్పుడు ఎవరూ సురక్షితంగా లేరు. అంతా కలిసే ఏదైనా చేయగలం.. ఒసాకా కరోనాను ఎదుర్కోవడంలో ముంబై మోడల్‌ను అనుసరించాలని సూచించారు. పలువురు నెటిజనులు మహీంద్రా సూచనను ప్రశంసించారు. ఓ స్థాయి కలిగిన వ్యక్తి భారత్‌ను దుయ్యబట్టవద్దని ధైర్యం చేసి సలహా ఇవ్వడం మంచి విషయమని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

