కెనడాలో బాబు.. అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు
మహబూబాబాద్, మార్చి 31 : కెనడాలో బాబు.. మహబూబాబాద్‌లోని అనాథాశ్రమాల్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలను అమ్మమ్మ-తాతయ్య, గుండా మధురెడ్డి-పుష్ప దంపతులు ఆత్మీయులైన ఆనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన మధురెడ్డి ప్రముఖ వ్యాపారస్తులు.. మధురెడ్డి-పుష్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒకరు యూఎస్‌లో, మరోకరు కెనడాలో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. కాగా, చిన్న కూతురు నిహారిక-రవితేజరెడ్డి కుమారుడు శ్రే యాన్స్ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలనుకున్నారు. అయితే కెనడాలో కరోనా విజృంభిస్తున్న ఇండియాకు రాలేకపోయారు. కాగా, శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలను అమ్మమ్మ-తాతలకు మండలంలోని సికింద్రాబాద్తండాలోని ఆదరణ వృద్ధ్దుల ఆశ్రమం, జిల్లా కేంద్రంలో ఉన్న దైవకృప అనాథాశ్రమాల్లో శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో పండ్లు, నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రేయాన్స్ తాతయ్య మధురెడ్డి మా ట్లాడుతూ అనాథాశ్రమం నిర్వహణ ఉన్నంతకాలం పిల్లలు, వృద్ధుల కోసం సబ్బులను దానం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంజిత్, వీరన్న, మోహన్, వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


