Taj mahal | విద్యుత్తు వెలుగుల్లో తాజ్‌మహల్ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదూ. అయితే, మీరు చూస్తున్నది షాజహాన్ కట్టించిన నిజమైన తాజ్‌మహల్ కాదు. తాజ్‌ను పోలిన ఓ నివాస భవనం. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ చోక్సే అనే వ్యక్తి తన భార్య కోసం ఎంతో ప్రేమగా ఈ భవనాన్ని కట్టించాడు. నాలుగు గదులు, హాల్, కిచెన్, మెడిటేషన్ గది, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉన్న ఈ భవంతి నిర్మాణానికి మూడేండ్ల సమయం పట్టింది.