కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని ఆడే ప్రయత్నం చేసిన డుప్లెసిస్.. విఫలమయ్యాడు. తన నుంచి దూరంగా వెళ్తున్న బంతిని డిఫెండ్ చేసేందుకు బ్యాటును ముందుకు నెట్టడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో బెంగళూరు జట్టు 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.