ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్గా రూపొందుతున్నదీ చిత్రం. ఉగాది పండుగ రోజున దర్శక నిర్మాతలు చిత్ర టైటిల్ను ప్రకటించారు. దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ..‘మా కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. అందమైన ప్రేమ కథ చుట్టూ అల్లుకున్న థ్రిల్లింగ్ అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నాం’ అన్నారు.