ఢిల్లీలో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ గార్సెటీ?

వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్‌లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్నది. వాషింగ్టన్ లో అధికార మార్పిడి జరగడమే అందుకు కారణం. 50 సంవత్సరాల గార్సెటీ అమెరికాలో న్యూయార్క్ తరువాత రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలిస్‌కు 42వ మేయరుగా ఉన్నారు. అధ్యక్షుడు బైడెన్ ప్రచార కమిటీకి గార్సెటీ కోచైర్మన్‌గా ఉన్నారు. నిజానికి ఆయనకు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ ఎందువల్లనో కుదరలేదు. అందుకే ఆయనను కీలకమైన భారత రాయబారి పదవిలో నియమించాలని బైడెన్ నిర్ణయించారు. అలాగే చైనాకు నికోలస్ బర్న్స్, జపాన్‌కు రహమ్ ఇమాన్యుయేల్, టామ్ నైడ్స్ ఇజ్రాయెల్‌కు రాయబారిగా వెల్లనున్నారని తెలిసింది. కాగా గార్సెటీ కావచ్చు, మరొకరు కావచ్చు.. నియామక ప్రకటన వెలువడేంత వరకు ఏదీ ఖరారు కానట్టేనని వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

