Accident | లారీ, జీపు ఢీ.. ఎనిమిది మంది దుర్మరణం
Accident | లారీ, జీపు ఢీ.. ఎనిమిది దుర్మరణం | కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీప్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది.

బెంగళూరు : కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీప్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన చిక్కబల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా మరినాయకనహల్లి గ్రామ సమీపంలో.. చింతామణి – మదనపల్లి మార్గంలో జరిగింది. బాధితులను చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మృతులంతా కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ తాలూకాకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలం వద్ద బాధితులకు ఎమ్మెల్యే నంజయ్ గౌడ్ సహాయం అందించారు. జీపు మరినాయకనహళ్లి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై చింతామణి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

