జీవితం చిన్నదేమీ కాదు
మనం జీవించడమే
ఆలస్యంగా ప్రారంభిస్తాం
ఎప్పుడైతే నడవాల్సిన దారి
సరిగ్గా తెలుస్తుందో
అప్పుడే వెనుదిరిగి పోవాల్సిన
సమయం వచ్చేస్తుంది
జీవితం
కాలం లేపనాన్ని పూసి
నిన్ను ఓదారుస్తుంది
లే!
ఆ అంతిమ యాత్ర ముగిసీ
ముగియక ముందే
నీ శరీరావసరానికి
కాసింత మేత ఓదార్పు పెట్టు
నువ్వెలాగూ ఇప్పుడటు పోలేవు
ఎంత దగ్గరి వాళ్లయినా
నువ్వేమీ చేయలేవు
తప్పదు లేవాల్సిందే
లే!
ఏనుగు
నరసింహారెడ్డి
8978869183