RCB vs GG | చెలరేగిన వొల్వార్డ్, గార్డ్నర్.. ఆర్సీబీ టార్గెట్ 189
wpl 2023: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) భారీ స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై 188 రన్స్ కొట్టింది. ఓపెనర్ లారా వొల్వార్డ్ (68) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన అష్ గార్డ్నర్(41) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది.
RCB vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) భారీ స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై 188 రన్స్ కొట్టింది. ఓపెనర్ లారా వొల్వార్డ్ (68) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన అష్ గార్డ్నర్(41) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది.
చివర్లో హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (16)రెచ్చిపోయి ఆడారు. మేఘన్ షట్ వేసిన ఆఖరి ఓవర్లో హర్లీన్, హేమలత తలా ఒక ఫోర్, సిక్స్ బాదారు. దాంతో, గుజరాత్ 20 ఓవర్లలో 188 రన్స్ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. సోఫీ డెవినే, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ తీశారు.
వొల్వార్డ్ క్లాస్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా(Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. అయితే.. మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ సాధించింది. సబ్బినేని మేఘన (31)తో కలిసి రెండో వికెట్‌కు 63 రన్స్, అష్ గార్డ్నర్తో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించింది. శ్రేయాంక పాటిల్ ఓవర్లో దిశా కసాత్ క్యాచ్ పట్టడంతో వొల్వార్డ్ ఔటయ్యింది. ప్రీతి బోస్ ఓవర్లో సబ్బినేని మేఘన(31)ను రీచా ఘోష్ స్టంపౌట్ చేసింది. దాంతో, గుజరాత్ 90 రన్స్ వద్ద రెండో వికెట్ పడింది..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

