విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. ప్రస్తుతం కశ్మీర్లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విజయ్ దేవరకొండ, సమంత నవ వధూవరులుగా కొంగుముడితో కనిపిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించారు. జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్ : పీటర్ హెయిన్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: జి. మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, సీయీవో: చెర్రీ.