2020-21ఆర్థిక సంవత్సరంలో కేవీఐసీ సరికొత్త రికార్డు …

ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్‌ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కెవిఐసి స్థూల వార్షిక టర్నోవర్ రూ. 95,741.74 కోట్లు ఉండగా. 2019-20లో అది రూ.88,887 కోట్ల టర్నోవర్ ఉన్నది. ఈ ఏడాది 7.71శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది మార్చి 25 న ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా మూడు నెలలకు పైగా ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసినా 2020-21లో కెవిఐసి రికార్డ్ పనితీరు ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
2015-16 సంవత్సరంతో పోల్చితే 2020-21లో ఖాదీ, గ్రామ పరిశ్రమ రంగాలలో మొత్తం ఉత్పత్తి 101శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ కాలంలో స్థూల అమ్మకాలు 128.66శాతం పెరిగాయి. కొత్త పిఎమ్ఇజిపి యూనిట్ల ఏర్పాటు, కొత్త ఎస్ఎఫ్యుఆర్టి క్లస్టర్లు, ప్రభుత్వ చేపట్టిన “స్వదేశీ” వంటి కార్యక్రమాలు, సదుపాయాల సరఫరా కోసం పారామిలిటరీ దళాలతో కెవిఐసి చారిత్రాత్మక ఒప్పందాలు మహమ్మారి సమయంలో కేవీఐసీ టర్నోవర్‌ను పెంచాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Business news
- Financial
- FY21
- kvic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

