బీజేపీ రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువు.. 66 వేల కేసులతో ఉత్తరప్రదేశ్ టాప్
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. టాప్-5 రాష్ర్టాల్లో నాలుగు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది.
- దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై నేరాలు-ఘోరాలు
- టాప్-5లో నాలుగు బీజేపీ పాలిత రాష్ర్టాలే..
- ఎన్సీఆర్బీ- 2023 నివేదికలో కీలక విషయాలు వెల్లడి
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. టాప్-5 రాష్ర్టాల్లో నాలుగు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. ఈ మేరకు జాతీయ నేర గణాంక శాఖ (NCRB-2023) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
గృహహింస, రేప్లే ఎక్కువ
2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,48,211 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్టు ఎన్సీఆర్బీ-2023 నివేదిక స్పష్టం చేసింది. మహిళలపై నేరాల్లో 66,381 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,101 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 45,450 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. పై మూడు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. మహిళలపై నేరాల్లో గృహహింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, హత్యలు, కిడ్నాప్లు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1,77,335 మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2022తో పోలిస్తే 2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

