భారీ వర్షాలకు కూలిన చక్కి రైల్వే బ్రిడ్జ్.. హిమాచల్ ప్రదేశ్‌లో 14 మంది మృతి
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శనివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉదయం అకస్మాత్తుగా భారీ వర్షం, వరద వచ్చింది. అయితే కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. చంబా జిల్లాలో వర్షాల వల్ల కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించారు.
#WATCH | Himachal Pradesh: The railway bridge on Chakki river in Himachal Pradesh's Kangra district damaged due to flash flood, and collapsed today morning. The water in the river is yet to recede: Northern Railways pic.twitter.com/ApmVkwAkB8
— ANI (@ANI) August 20, 2022
మండి జిల్లాలోని బాగీ నుల్లాలో ఓ అమ్మాయి మృతదేహన్ని ఇంటికి అరకిలోమీటరు దూరంలో గుర్తించారు. ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన అయిదుగురు వరదల్లో కొట్టుకుపోయినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అధికారులు తెలిపారు. క్లౌడ్‌బస్ట్ కావడంతో బాగీ నుంచి ఓల్డ్ కటోలా ప్రాంతంలో ఉన్న ఇండ్లకు చెందిన కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మండి జిల్లాలో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

