పక్కా! రిలయన్స్ ఏజీఎంలో 5జీ ఫోన్, జియోబుక్ లాంచ్?

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు చౌక ధరకే టెలికం సేవలను అందుబాటులోకి తెచ్చి సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో.. తాజాగా మరో సంచలనానికి సిద్ధం అవుతున్నది. దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో తొలి 5జీ స్మార్ట్ ఫోన్.. లోకాస్ట్ లాప్టాప్ జియోబుక్‌ను త్వరలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో 5జీ స్మార్ట్ ఫోన్, జియోబుక్ ఆవిష్కరించనున్నారు.
గూగుల్ పార్టనర్షిప్తో జియో 5జీ ఫోన్
సెర్చింజన్ గూగుల్ భాగస్వామ్యంతో 5జీ స్మార్ట్ ఫోన్ రూపుదిద్దుకుంటున్నది. ఆండ్రాయిడ్ లేదా ఆండ్రాయిడ్ గో ఆధారిత జియో ఓఎస్‌పై ఈ ఫోన్ పని చేస్తుందని సమాచారం. ఎంట్రీ లెవెల్ హార్డ్‌వేర్‌తోపాటు స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ తయారు చేసిన లైట్ వెయిట్ ఓఎస్ సిస్టమ్ ఆండ్రాయిడ్ గో. అయితే, లాప్టాప్ జియోబుక్కు సంబంధించిన సమాచారం మాత్రం బహిర్గతం కాలేదు.
5జీ ఫోన్ ఆండ్రాయిడ్ యూసేజ్‌పై చర్చలు
ఇదిలా ఉంటే, స్మార్ట్‌ఫోన్‌లో వాడే ఆండ్రాయిడ్ వర్షన్ గురించి ఇప్పటికీ గూగుల్, రిలయన్స్ జియో మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్‌తో కూడిన ఆండ్రాయిడ్ గో ఓఎస్.. 5జీ స్మార్ట్ ఫోన్లో అమర్చాలని నిర్ణయించాలని తెలుస్తున్నది.

జియోబుక్ కోసం చైనా సంస్థతో టైఅప్?
లాప్టాప్ల కోసం వాడే జియో ఓఎస్‌పై ఇంతకుముందు వచ్చిన వార్తలకు భిన్నంగా చైనాకు చెందిన బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థతో రిలయన్స్ జియో జత కట్టినట్లు వదంతులు వచ్చాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో జియో బుక్ అనే లాప్టాప్ నిర్మిస్తున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్‌లోనే జియో బుక్ డెవలప్మెంట్ ప్రారంభించినట్లు వార్తలొచ్చాయి. వచ్చేనెల మధ్యలో దీని వినియోగాన్ని పరీక్షించనున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
ఐపీఎల్ 2021 ‘క్వారంటైన్’ సాంగ్ విడుదల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

