బెంగుళూరు: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెన్ను నొప్పితో ఆ స్పీడ్ బౌలర్ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే అతను ఇటీవల ఆసియా కప్‌కు దూరం అయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20ల్లో బుమ్రా బౌలింగ్ చేశాడు. కానీ బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌కు బుమ్రా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రా మంగళవారం కూడా ప్రాక్టీస్ సమయంలో వెన్ను నొప్పి వచ్చినట్లు ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ మెడికల్ బృందం అతన్ని పరీక్షిస్తోంది. అయితే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా ఆడేది లేనిది డౌట్‌గా ఉందని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.