ప్రేమికుల దినోత్సవ కౌంట్‌డౌన్ చివరికొచ్చింది. ఇప్పటికే బహుమతుల చిట్టా తయారై ఉంటుంది. ఒకటిరెండు రోజులు ఆలస్యమైనా సరే.. ఓ మాంచి కానుక ఇచ్చి తీరాల్సిందే అనుకునేవారు, ఆ ఎంచుకునేదేదో అంతర్జాతీయ బ్రాండ్ అయితే బావుండని భావించేవారు ఎల్లార్డో బ్రాండ్ ‘జస్ట్ యు అండ్ మి’లవ్ ఫిగరిన్స్ గురించి ఆలోచించవచ్చు. వీటి ధర వేలల్లోనే ఉంటుంది. అయితేనేం, వేవేల జన్మల బంధాన్ని గుర్తుచేయ డానికి ఇంతకు మించిన కానుక ఏం ఉంటుంది?