GT vs DC | ఢిల్లీ బౌలర్ల దూకుడు.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్
GT vs DC | రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్లో ఐదో బంతికి మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు.
GT vs DC | ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ కుప్పకూలింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ ముందు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా, ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు చతికిలబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. ఒక్క రషీద్ ఖాన్ (31) మాత్రమే జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజరాత్ ఆగిపోయింది.
రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్లో ఐదో బంతికి మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్డర్ (2) కూడా రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్ (0)ను రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 12వ ఓవర్లో రెండో బంతికి రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో చివరి బంతికి మోహిత్ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18వ ఓవర్లో మొదటి బంతికే రషీద్ ఖాన్ (31) పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయ్యింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

