IPL 2023 | ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ఆర్సీబీకి రెండో ఓటమి
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. నికోలస్ పూరన్(62), స్టోయినిస్(65) సునామీలా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, 213 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో చేదించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
IPL 2023 : చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. నికోలస్ పూరన్(62), స్టోయినిస్(65) సునామీలా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, 213 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో చేదించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
భారీ లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్(0) బౌల్డ్ అయ్యాడు. పార్నెల్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో దీపక్ హుడా(9), కృనాల్ పాండ్యాను పెవిలియన్ పంపడంతో 23 పరుగులకే లక్నో మూడు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న స్టోయినిస్(65)ను కరణ్ శర్మ ఔట్ చేశాడు. నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(18) ఔట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది. నికోలస్ పూరన్(10), ఆయూష్ బదొనీ (5) ధాటిగా ఆడారు. సిక్స్‌లతో చెలరేగిన పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, వెనే పార్నెల్ రెండేసి వికెట్లు తీశారు.
టాపార్డర్ వీర బాదుడు
సొంత స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(61), ఫాఫ్ డూప్లెసిస్(78)తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కోహ్లీ ధనాధన్ ఆడడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ పడకుండా 56 రన్స్ చేసింది. లక్నో బౌలర్లపై విరుచుకు పడిన కోహ్లీ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. దాంతో, 96 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాతడూప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. వుడ్ ఓవర్లో సిక్స్‌తో ఫీఫ్టీ పూర్తి చేసుకున్న అతను బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో డూప్లెసిస్ 105 మీటర్ల సిక్స్ కొట్టాడు. ధనాధన్ ఆడిన వీళ్లు రెండో వికెట్‌కు వంద రన్స్ రాబట్టారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా ఒక వికెట్ తీశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

