తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. రితికా సింగ్ నాయికగా నటిస్తున్నది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ నటిస్తుండగా..పోలీస్ ఆఫీసర్గా రితికా సింగ్ కనిపించనుంది. 1923లో మోడల్ డోరతీ కింగ్ హత్య సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ‘గతంలో విజయ్ ఆంటోనీతో ‘విజయ రాఘవన్’ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం హత్య అనే సినిమా నిర్మాణంలో ఉంది. త్వరలో మరో రెండు చిత్రాలనూ విజయ్ ఆంటోనీతో కలిసి నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.