స్ఫూర్తి తెలంగాణ
అవమానాలు అణచివేతలపై పిడికిలి బిగించిన నేల స్వేచ్ఛాగీతానికి ఉద్యమ స్వరాలద్దిన పోరుభూమి సర్వమతాలు, జాతి సంస్కృతులకు నెలవైన అమ్మ ఒడి స్వరాష్ట్ర స్వప్న సాకారానికి పోరాట పాఠాలు నేర్పిన బడి నాది తెలంగాణ యుద్ధరాగాల్ని శాంతి గీతాల్ని రవళించే వీణ
అవమానాలు అణచివేతలపై పిడికిలి బిగించిన నేల
స్వేచ్ఛాగీతానికి ఉద్యమ స్వరాలద్దిన పోరుభూమి
సర్వమతాలు, జాతి సంస్కృతులకు నెలవైన అమ్మ ఒడి
స్వరాష్ట్ర స్వప్న సాకారానికి పోరాట పాఠాలు నేర్పిన బడి
నాది తెలంగాణ యుద్ధరాగాల్ని శాంతి గీతాల్ని రవళించే వీణ
అరవై ఏండ్ల పరాయి పాలనలో గుండెల నిండా కన్నీటి ధార
నిలువెత్తు గాయాలైనా నిలువుదోపిడిపై నిలిచి గెలిచిన రణధీర
ఉసిల్ల పుట్టలై ఉద్యమానికి ఊపిరిలూదిన ముక్కోటి జనగానం
మట్టితల్లి విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగం
ఇది తెలంగాణ పోరాటాల తెగువ.. మడమ తిప్పని నైజం నరనరాన
ఉబికి వస్తున్న దుఃఖాన్ని గుండె లోతుల్లో దాచుకుని
జై తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకుని
త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న ఆశల సౌధం
బంగారు తెలంగాణే లక్ష్యంగా చేసే ఆశయాల సేద్యం
మాది తెలంగాణ గమ్యం చేరే దాక ఆగని నిరంతర సాధన
పంట సిరులకు ఊతమిచ్చిన కాకతీయ, కాళేశ్వర జలధార
పుడమి పుత్రునికి రైతుబంధు, రైతుబీమాలతో ఆసరా
బతుకు తెరువైన బడుగులకు పథకాల నజరాన
ఆదిలాబాద్ మొదలు హస్తిన వరకు స్ఫూర్తి తెలంగాణ
భవిష్యత్ భారతావని కంతటికీ కావాలె ఈ నేల పాలన
-మధుకర్ వైద్యుల
80966 77409
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

