సముద్రంలో చిక్కుకున్న కార్గో షిప్‌కు ఐఎన్ఎస్ తల్వార్ సహాయం

న్యూఢిల్లీ: సహాయంలో ముందుండే భారత నౌకాదళం మరోసారి దీనిని నిరూపించింది. సాంకేతిక సమస్యతో సముద్రంలో చిక్కుకున్న కార్గో షిష్‌కు అవసరమైన సహాయాన్ని అందించింది. ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్న ఎంవీ నయన్ అనే రవాణా నౌక ఇటీవల ఒమన్ నుంచి ఇరాక్‌కు బయలుదేరింది. అయితే ఈ నెల 9న ఆ నౌకలోని ప్రొపల్షన్, విద్యుత్, నేవిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎంవీ నయన్ ఒమన్ గల్ఫ్‌లోని సముద్రంలో చిక్కుకుని నీటి ప్రవాహానికి కొట్టుకుపోసాగింది. ఈ నేపథ్యంలో అందులోని సిబ్బంది సహాయం కోసం సందేశాన్ని పంపారు.

మరోవైపు ఒమన్ గల్ఫ్ సముద్ర జలాల్లో మోహరించిన ఐఎన్ఎస్ తల్వార్‌కు గురువారం ఆ సహాయ సందేశం అందింది. దీంతో నౌకాదళ సిబ్బంది తక్షణం రంగంలోకి దిగారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా రవాణా నౌక పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం సాంకేతిక సిబ్బంది ఒక బోటులో ఎంవీ నయన్ వద్దకు చేరారు. అందులోని విద్యుత్ జనరేటర్, ప్రొపల్షన్, నేవిగేషన్ వ్యవస్థలను సరి చేశారు. దీంతో రవాణా నౌక ఎంవీ నయన్ తదుపరి పోర్టునకు సురక్షితంగా చేరిందని భారత నౌకాదళం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

