ఇన్ఫీలాభం రూ.5,421 కోట్లు

- రూ.29,602 కోట్లకు పెరిగిన ఆదాయం
- మధ్యంతర డివిడెండు షేరుకు రూ.15
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్…విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాది ఇదేకాలంలో పోలిస్తే 11.9 శాతం వృద్ధితో రూ.5,421 కోట్లకు చేరింది. 2020 సెప్టెంబర్ క్వార్టర్లో ఈ లాభం రూ.4,845 కోట్లు. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.5,195 కోట్లకంటే సెప్టెంబర్ క్వార్టర్లో లాభం 4.4 శాతం వృద్ధిచెందింది. తాజాగా ఆదాయం గతేడాదికంటే 20.5 శాతం వృద్ధితో రూ.24,570 కోట్ల నుంచి రూ.29,602 కోట్లకు పెరిగినట్లు ఇన్ఫోసిస్ బుధవారం తెలిపింది. సీక్వెన్షియల్‌గా ఆదా యం 6.1 శాతం అధికమయ్యింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.15 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. ఇన్ఫోసిస్ వెల్లడించిన వివరాలివి…
2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ 16.5-17.5 శాతం మేర వృద్ధి చెందుతుందని తెలిపింది.
- డైమ్లర్ డీల్ ద్వారా భారీగా వచ్చిన ఆదాయంతో పాటు క్లయింట్లు డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడంతో అన్ని వ్యాపార విభాగాల్లోనూ, ప్రపంచంలో తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ ఆదాయం పెరిగినట్లు పేర్కొంది.
- ఇతర ఆదాయం 15.8 శాతం తగ్గినా, మొత్తం ఆదాయంలో 20.5 శాతం వృద్ధిసాధించింది.
- ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా నుంచి వచ్చిన ఆదాయం అధికంగా 23 శాతం వృద్ధి చెందింది. రంగాలవారీగా ఫైనాన్షియల్ సర్వీసుల నుంచి ఆదాయం వృద్ధి 20.5 శాతం కనిపించింది.
- డిజిటల్ వ్యాపారం ద్వారా 56.1 శాతం ఆదాయం సమకూరింది. ఇది గతేడాదికంటే 42.4 శాతం వృద్ధి చెందింది.
- టాలెంట్‌ను నిలుపుకునేందుకు, వేతనాల్ని పెంచడంతో గతేడాది కంటే ఉద్యోగ వ్యయాలు 17.5 శాతం పెరిగాయి. సీక్వెన్షియల్‌గా 3.4 శాతం ఎక్కువయ్యాయి.
- ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 2.15 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద డీల్స్ లభించాయి.
45,000 ఫ్రెషర్ల నియామకాలు
సాఫ్ట్వేర్ సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఏడాది 45,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. సర్వీసుల డిమాండ్‌తో పాటు మరోవైపు వలసలు పెరుగుతున్నందున రిక్రూట్‌మెంట్స్‌ను పెంచింది. జూన్ క్వార్టర్లో 13.9 శాతం ఉన్న ఉద్యోగుల వలసలు సెప్టెంబర్ క్వార్టర్లో 20.1 శాతానికి చేరినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ అవకాశాల్ని పూర్తిగా అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది 45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్‌రావు తెలిపారు.
‘భారీ డీల్స్ రావడంతో మా విశ్వాసం పెంపొందింది. అందుకే రెవిన్యూ గైడెన్స్‌ను పెంచుతున్నాం. కొవిడ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచీ భారత ఐటీ సర్వీసుల రంగానికి… క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భారీ అవకాశాలొస్తున్నాయ్’-సలీల్ పరేఖ్ సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్
ఐటీ పోర్టల్ చక్కబడింది
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ సాంకేతిక సమస్యల్ని చాలావరకూ పరిష్కరించామని, ఇప్పటివరకూ ఈ పోర్టల్ ద్వారా 1.9 కోట్ల రిటర్న్‌లు దాఖలయ్యాయని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. 3.8 కోట్ల మంది యూజర్లు వారి లావాదేవీల్ని పూర్తిచేశారని, ప్రతీ రోజూ 2-3 లక్షల రిటర్న్‌లు ఫైల్ అవుతున్నాయన్నారు. కాగా, కంపెనీ సీవోవో ప్రవీణ్‌రావు డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

