సిరీస్పైనజర్
- నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు

సఫారీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ పట్టాలని తహతహలాడుతున్న టీమ్ఇండియా.. ఆఖరి పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్‌లో చక్కటి విజయంతో సిరీస్‌పై కోహ్లీసేన పైచేయి సాధిస్తే.. ఆ వెంటనే జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. ఇక నిర్ణయాత్మక మూడో పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! వెన్ను నొప్పి కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ అందుబాటులోకి రావడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. నాలుగేండ్ల క్రితం ఇక్కడే టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా సత్తాచాటేందుకు రెడీ అయ్యాడు!
కేప్‌టౌన్: అందని ద్రాక్షను ఒడిసి పట్టేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. చివరి మ్యాచ్‌కు సమాయత్తమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు నెగ్గి 1-1తో సమ ఉజ్జీలుగా నిలువగా.. న్యూలాండ్స్ మైదానంలో మంగళవారం నుంచి నిర్ణయాత్మక పోరు ప్రారంభం కానుంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ తిరిగి జట్టులో చేరడం టీమ్ఇండియాకు కొండంత అండ కాగా.. కెప్టెన్ కోసం మరోసారి తెలుగు ఆటగాడు హనుమ విహారిపై వేటు తప్పకపోవచ్చు! హైదరాబాదీ పేసర్ సిరాజ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఇషాంత్, ఉమేశ్‌లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.
విరాట్ కోహ్లీకి ఇది 99వ టెస్టు మ్యాచ్ కాగా.. నాలుగేండ్ల క్రితం ఇదే గ్రౌండ్లో టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా న్యూలాండ్స్‌లో అడుగుపెట్టనున్నాడు. రాహుల్, మయాంక్ మంచి టచ్‌లో ఉండగా.. గత రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం బాదని విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లోనైనా మూడంకెల స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకోకుండా అనవసరంగా వికెట్ పారేసుకుంటున్న రిషబ్ పంత్ గాడిన పడాలని సీనియర్లు హెచ్చరిస్తుంటే.. అశ్విన్, శార్దూల్ బ్యాట్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఎల్గర్, మార్క్మ్,్ర బవుమా, పీటర్సన్‌తో సఫారీ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నది.
పిచ్, వాతావరణం
పచ్చిక ఎక్కువ లేకపోవడంతో బ్యాటర్లు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం పడకపోవచ్చు. మ్యాచ్ సాగుతున్నా కొద్ది స్పిన్నర్లు ప్రభావం చూపే చాన్స్ ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలెక్కువ.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, శార్దూల్, షమీ, బుమ్రా, ఇషాంత్/ఉమేశ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్మ్,్ర పీటర్సన్, డసెన్, బవుమా, వెరినె, జాన్సెన్, కేశవ్, రబడ, ఒలీవర్, ఎంగ్డీ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

